Header Banner

జే బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం - ఆ పార్టీ నేతలే బట్టబయలు! ఈగల్ టీమ్ లను ఏర్పాటు!

  Wed Apr 09, 2025 17:13        Politics

గత వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో మద్య నిషేధం హామీతో వచ్చి.. వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్చిన్నం చేశారని మండిపడ్డారు. "వైకాపా ప్రభుత్వంలో డిస్టిలరీల నుంచి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. జగన్ (YS Jagan) తీరుతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 

ఇది కూడా చదవండి: వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి! ఒక్క రూపాయి కూడా..

 

జే బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ, లివర్ సమస్యలతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం. అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహించి మద్యం దుకాణాలు కేటాయించాం. నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తున్నాం. మొన్నటి వరకు గంజాయి అక్రమ రవాణాతో యువత జీవితాలు చిత్తయ్యాయి. గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీమ్లను ఏర్పాటు చేసుకున్నాం. గత ఐదేళ్ల అక్రమాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారు” అని కొల్లు రవీంద్ర తెలిపారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KolluRavindra #AndhraPradesh #APpolitics #Telugudesam #PerniNani #YSRCP